గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన టీజీఐఐసీ ఛైర్ పర్సన్
MDK: ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.