జనావాసాల్లోకి దూసుకొచ్చిన ఏనుగు

AP: చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్‌చల్ చేసింది. జనావాసాల్లోకి గజరాజు రావడంతో స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును అడవుల్లోకి పంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏనుగు దాడిలో ఫారెస్ట్ అధికారి సుకుమార్ కాలు విరిగిపోయింది. గంగవరం సాయిబాబా ఆలయం దగ్గర ఏనుగు సంచరిస్తుంది. దీంతో పలమనేరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు.