సంగారెడ్డిలో విద్యార్థుల ర్యాలీ
SRD: పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. ఉపకార వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఉపకార వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.