VIDEO: దుకాణాలలోకి చేరిన వరద నీరు

MDK: టేక్మాల్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి, దుకాణాలలోకి వరద నీరు చేరింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి బొడ్మట్ పల్లి గ్రామంలో లోతట్టు ప్రాంతాలలో వరద నీరు ప్రవాహం పెరిగి దుకాణాలు, ఇండ్లలోకి నీరు చేరాయి. బియ్యం దుకాణంలో నీరు చేరడంతో బియ్యం బస్తాలు వరద నీటిలో తడిసిపోయాయి. దీంతో వ్యాపారులకు భారీ నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.