VIDEO: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు
JGL: కార్తీక మాసం, నాగుల చవితి, శనివారం విశిష్టత కారణంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మపురి క్షేత్రానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు క్యూ పద్ధతిలో భక్తులు వేచి ఉన్నారు.