'శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి'

'శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి'

కడప జిల్లాలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టరేట్లో నిన్న  జిల్లా శాంతి కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ డా. నిధిమీనా అధ్యక్షతన అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పండుగలను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. పండుగల సందర్భంగా ఆలయాలు, మసీదులు వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.