టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బీద రవిచంద్ర..!
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బీద రవిచంద్ర పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాగా, అధికార ప్రకటన విడుదల అవ్వాల్సి ఉన్నది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాయలసీమ ఇంఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. పలువురు నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.