ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా..!

ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా..!

KNR: హుజూరాబాద్ పట్టణంలో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై పురపాలక ఛైర్‌పర్సన్ సుహాసిని నిషేధం విధించారు. గురువారం వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడకూడదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 26 నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడతామని, నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు.