పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

RR: గ్రామపంచాయతీ ఎన్నికలు రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామంలో గల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.