VIDEO: అగళి మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

సత్యసాయి: అగళి మండలం ఆలుడి, కొమరేపల్లి గ్రామాల నుంచి 100 వైసీపీ కుటుంబాలు సోమవారం టీడీపీలోకి చేరారు. మడకశిర టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.