తేనెటీగలు దాడి.. వృద్ధురాలికి గాయాలు

తేనెటీగలు దాడి.. వృద్ధురాలికి గాయాలు

అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని కొటావారిపల్లికి చెందిన చంద్రమ్మ(60)పై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.