'ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు'

HYD: ఉచిత వైద్య శిభిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ మేకలమండిలోని ప్రభుత్వ పాఠశాలలో బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి, అగర్వాల్ సేవాదల్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.