'సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి'
PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను సేకరించారు. ఆర్థిక మోసాలు, కుటుంబ వివాదాలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి అంశాలపై 93 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.