'రోగులకు నిరంతరం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి'

BHPL: మొగుళ్ళపల్లి మండలంలో108 అంబులెన్స్‌ను జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని సామాగ్రి, మెడికల్ కిట్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక వైద్య సహాయం అందించడంలో ముందుండాలని ఆదేశించారు. రోగులకు నిరంతర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.