హామీగానే నిలిచిన వంతెనల నిర్మాణం

హామీగానే నిలిచిన వంతెనల నిర్మాణం

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులలో ఉన్న వాగులపై వంతెనల నిర్మాణం పగటి కలగానే మారుతుంది. మండలంలోని లోతరే, జన్నారం, మల్యాల గ్రామాల శివారులో ఉన్న వాగులపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. అయితే.. లోతరే వాగుపై మాత్రం ఇటీవలే వంతెన మంజూరు అయింది. రోటిగూడా వాగుపై హై లెవెల్ బ్రిడ్జితో పాటు, మిగిలిన వాగులపై వంతెనలు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.