పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NDL: బండిఆత్మకూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం జరిగింది. ZP పాఠశాలలో 2004-05 విద్యాసంవత్సంలో విద్యనభ్యసించిన విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ పాత జ్ఞాపకాలతోపాటు ప్రస్తుతం ఏయే రంగాల్లో స్థిరపడ్డారో వివరించారు. అనంతరం అందరూ సరదాగా ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు.