గుండెపోటుతో మహిళ మృతి

గుండెపోటుతో మహిళ మృతి

KMM: BJP ముదిగొండ మండల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ సతీమణి బెల్లంకొండ నాగేంద్రమ్మ శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. నాగేంద్రమ్మ ఇంట్లో పని చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి మృతి పట్ల బీజేపీ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించారు.