నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NDL: కోవెలకుంట్ల, దొర్నిపాడు మండల పరిధిలో ఇవాళ 2వ శనివారం సందర్భంగా మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉ.10 గంటల నుంచి మ.1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.