రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
కృష్ణా: ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. గోపాలపురం గ్రామానికి చెందిన భూక్య కమల (40) రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. కమల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.