'విద్యుత్ కోత సమస్య పరిష్కరించాలి'
MNCL: భీమారం మండలంలోని మద్దికల్ గ్రామంలో విద్యుత్ కోత సమస్య పరిష్కరించాలని మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేళాపాళా లేకుండా విద్యుత్ కోత విధిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.