కర్రెగుట్టల్లో కాల్పులు.. జవాన్ మృతి

TG: కర్రెగుట్టల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ల్యాండ్‌మైన్ పేలి 204 కోబ్రా కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ సాగర్ బొరడేకి తీవ్ర గాయాలై ప్రాణాలు వదిలారు. DRG జవాన్ ల్యాండ్‌మైన్‌పై కాలు వేయడంతో బ్లాస్టింగ్ జరిగి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుట్టపై కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.