మేధా స్కూల్ వద్ద ఆందోళన

TG: సికింద్రాబాద్ మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆ స్కూల్ సీజ్ అయిన విషయం తెలియక విద్యార్థులు బడికి వెళ్లారు. పాఠశాల సీజ్ అయినట్లు సమాచారం కూడా ఇవ్వలేదని, పిల్లల భవిష్యత్తుపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామన్నారు. స్కూల్లో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమన్నారు.