విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సందర్శించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంపై విద్యార్థులతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యేకు వివరించగా, విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.