నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: శ్రీశైల మండల పరిధిలో నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ ఏఈ దుర్గాశివరాం ప్రసాద్ శుక్రవారం తెలిపారు. సున్నిపెంటలోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఈ విద్యుత్ కోత విధిస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామ విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.