నిత్యావసర ధరలు తగ్గించాలంటూ సీపీఎం ఆందోళన
ASR: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.పోతురాజు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బిల్లపుట్టి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయడంలో విఫలమైందని, సామాన్య ప్రజలు వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొందన్నారు.