హోటళ్లలో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్
NRPT: ఆహార వ్యాపార సంస్థలు, హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు హోటళ్లకు ఎప్పటికప్పుడు వెళ్లి తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడి కేంద్రాల్లో ఆహార పదార్థాల తనిఖీ చేస్తామని చెప్పారు.