మోసం, ఆరేగూడ గ్రామాల సమీపంలో పెద్దపులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం మోసం, ఆరేగూడ గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపారులు సహా ఎవరూ అటవీ ప్రాంతం లేదా పత్తి పొలాలకు వెళ్లవద్దని సూచించారు.