ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
MDK: వెల్దుర్తి పీఎం శ్రీ హైస్కూల్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ ఫ్రాడ్స్ పై అవగాహన కల్పించారు. సెంటర్ ఫర్ లిటరసీ కౌన్సిలర్స్ వడ్ల నాగేందర్, శ్రీనివాస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్‌లో రకాలు, కేవైసీ, నామిని, డిజిటల్ పేమెంట్స్ గురించి విద్యార్థులకు తెలిపారు.