ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ శ్రీనివాసరావు పేట కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రతి సమస్యకు చర్యలు తీసుకోవడం ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి అత్యంత అవసరం అని ఆమె అన్నారు.