ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన డీసీవో
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో కరుణాకర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి, పలు రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోళ్ళు చేయాలన్నారు.