ఇంఛార్జ్ సబ్ కలెక్టర్‌గా భానుప్రకాష్ రెడ్డి

ఇంఛార్జ్ సబ్ కలెక్టర్‌గా భానుప్రకాష్ రెడ్డి

TPT: గూడూరు డివిజన్ ఇంఛార్జ్ సబ్ కలెక్టర్‌గా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. భానుప్రకాశ్ రెడ్డి శనివారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జూన్ 20 వరకు సెలవులపై వెళ్లడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని తెలిపారు.