ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

KNR: చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై పేషంట్లతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? సేవలు ఎలా ఉన్నాయి..? అని ఆరా తీశారు. అదేవిధంగా వైద్యులతోనూ మాట్లాడారు. ప్రజలు మెచ్చే విధంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే వైద్యులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.