చిరు మూవీ నుంచి సెకండ్ సింగిల్ UPDATE

చిరు మూవీ నుంచి సెకండ్ సింగిల్ UPDATE

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే ఈ మూవీ నుంచి 'మీసాల పిల్ల' పాట రిలీజ్ కాగా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా అదే జోష్‌లో మేకర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. 'శశిరేఖ' అనే పాట ప్రోమోను ఈ నెల 6న, ఫుల్ పాటను ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.