VIDEO: రైల్వే ట్రాక్ కింద ఇరుక్కుపోయిన లారీ
KNR: కరీంనగర్ పట్టణ శివారు తీగల గుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద భారీ లోడుతో వెళ్తున్న లారీ ఇరుక్కుపోయింది. ఉజ్జయినికి పత్తి లోడుతో వెళ్తున్న లారీ, భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన తక్కువ ఎత్తు గేట్లకు తగిలి ట్రాక్ వద్ద చిక్కుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన అధికారులు జేసీబీ సహాయంతో రోడ్డును తవ్వి లారీని ముందుకు పంపించారు.