ధాన్యలక్ష్మీగా అమ్మవారు

కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో వెలసిన శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్దఎత్తున్న భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.