నగరపాలక సంస్థ శకటానికి ద్వితీయ స్థానం

NLR: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రభుత్వ విభాగాల శకటాల ప్రదర్శనలో నగరపాలక సంస్థకు చెందిన శకటం ద్వితీయ స్థానం సాధించింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేతుల మీదుగా నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ జ్ఞాపికను అందుకున్నారు.