కరణం చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో డా. నిర్మల వై కరణం మెమోరియల్ ఆల్ ఫ్రెస్కో యాంపీథియేటర్ ప్రారంభోత్సవం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొని, ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్, కలెక్టర్ డా. నిర్మల వై కరణం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.