పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహుకరణ

MDK: శివంపేట మండలం గోమారం హైస్కూల్ విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సీనియర్ హైకోర్టు న్యాయవాది దొంతురెడ్డి వెంకట్ రెడ్డి సహాయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు దిన పత్రికల కోసం రూ. 10 వేలు, సౌండ్ సిస్టం స్పీకర్ల కోసం రూ. 22 వేలు అందజేశారు. గ్రామానికి సహకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.