తిరుపతి NSUలో చిరుత కలకలం

తిరుపతి NSUలో చిరుత కలకలం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యా లయం (NSU)లో చిరుతపులి కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి క్యాంపస్లో చిరుత పులిని చూసిన ఉద్యోగులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. యూనివర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఇతర ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. నీలాచల హాస్టల్ సమీపంలో పులిని గుర్తించినట్లు సమాచారం.