చంద్రగిరిలో బైకులు తగలబెట్టిన వ్యక్తి అరెస్ట్

చంద్రగిరిలో బైకులు తగలబెట్టిన వ్యక్తి అరెస్ట్

TPT: చంద్రగిరి మండలం తొండవాడలో బైకులకు నిప్పు పెట్టి ప్రజలను భయాందోళనకు గురిచేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు అతడిని మందలించాడు. కక్ష కట్టిన నిందితుడు గౌతం బాబు బైకులను తగలబెట్టాడు. ఇతనిపై గూడూరు, ఎంఆర్ పల్లి, చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లలో గతంలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.