'కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహార్దశ'

'కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు మహార్దశ'

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సోమవారం రాచాలపల్లి మాదారం రహదారి నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ఏర్పడితే గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. రెండు కోట్ల రూపాయలతో ఈ దారి నిర్మిస్తున్నామని తెలిపారు.