VIDEO: పిఠాపురంలో రైతులు ఆవేదన
KKD: పిఠాపురం నియోజకవర్గంలో ఏ రైతును కలిసిన 'మొంథా తుఫాన్' సాయం అందలేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అవేదన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి పిఠాపురంలో సీపీఐ, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆరోపించారు.