టెట్ పరీక్షల నుంచి మినహాయింపు కోరుతూ టీచర్ల ధర్నా
VZM: 2010కి ముందు విధుల్లో చేరిన టీచర్లకు TET పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని UTF రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ DEO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.TET పరీక్షలు రద్దుకు రివ్యూ పిటిషన్ వేయాలని, విద్యాహక్కు చట్టం సెక్షన్-23లో మార్పులు చేయాలని కోరారు. ఈనెల18న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలన్నారు.