చల్లని పానీయాలకు పెరిగిన డిమాండ్

చల్లని పానీయాలకు పెరిగిన డిమాండ్

నెల్లూరు నగరంలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రోడ్ల పక్కన లభించే కొబ్బరి బొండాలు, చెరకు రసం, తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే వేసవి తాపాన్ని తట్టుకోవడానికి వాటితో పాటుగా ఎక్కువగా మజ్జిగ, రాగి సంకటి లాంటివి తీసుకోవడం ఆరోగ్యనికి మంచింది.