సర్వేపల్లిలో మెగా కంటి వైద్య, శస్త్ర చికిత్స శిబిరం

సర్వేపల్లిలో మెగా కంటి వైద్య, శస్త్ర చికిత్స శిబిరం

NLR: వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ఉచిత మెగా కంటి వైద్య, శస్త్ర చికిత్స శిబిరం ఆదివారం ప్రారంభం అయింది. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి సర్వేపల్లి నియోజకవర్గంలోని మండలాల వారితో పాటు ఇతర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.