'తండ్రి, అన్న కలిసి చంపేశారు..!'

'తండ్రి, అన్న కలిసి చంపేశారు..!'

CTR: యాదమరి(M) తోటికాడ ఇండ్లు గ్రామంలో ఈనెల 11న ఓ యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. విజయ్ కుమార్ మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. దీంతో అతడి తండ్రి సదాశివన్, అన్న శివకుమార్ కలిసి విజయ్‌ను కర్రలతో కొట్టి, తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.