అయ్యప్పస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే
MBNR: అయ్యప్ప మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో శనివారం వేపూరిగేరిలో అయ్యప్పస్వామి సామూహిక మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అయ్యప్ప ప్రతిమకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.