VIDEO: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మార్కెట్ ఛైర్మన్
SRPT: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని కోరారు.