నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
SKLM: కవిటి ఎం జగతి ఫీడర్ పరిధిలో విద్యుత్తు మరమ్మత్తుల పనులు కారణంగా బుధవారం సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రగడ పుట్టుగ, రామయ్య పుట్టుగ, జాలారి పాలెం, కొత్త పాలెం, కవిటి కొత్తూరు ప్రాంతాల్లో ఉ.9 నుంచి సా .4 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.