డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన

డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన

AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేట గ్రామంలో మంగళవారం డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గ్రామంలో డ్రైనేజ్ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేసినట్లు ఉపసర్పంచ్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు కే వెంకటరమణ తెలిపారు.